కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రయివేటు బస్సులపై విస్తృత తనిఖీలను ప్రారంభించారు.విజయవాడ హైవే, బెంగళూరు హైవే ప్రాంతాల్లో ఆర్టీఏ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి.రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేసి, ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను పరిశీలించారు.ఈ తనిఖీలలో వాహనాల ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను జాగ్రత్తగా తనిఖీ చేశారు.
ఐదు ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు
నిబంధనలు పాటించని 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేయగా, బస్సు అద్దం పగిలినప్పటికీ నడిపే బస్సును సీజ్ చేశారు.జడ్చర్ల వద్ద ఈ బస్సు రోడ్డుప్రమాదానికి గురైందని ప్రయాణికులు తెలిపారు. ఎల్బీ నగర్లోని చింతలకుంట ప్రాంతంలో కూడా ఆర్టీఏ అధికారులు తనిఖీలు జరిపారు.
నిబంధనలు ఉల్లంఘించిన మరో ట్రావెల్స్ బస్సును సీజ్ చేసి, రోడ్లపై నియమాలు పాటించకుండా తిరుగుతున్న మరొక 4 బస్సులపై కేసులు నమోదు చేశారు.


