గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి…
నగర కార్యదర్శి శ్రీరాములు డిమాండ్
విశాలాంధ్ర అనంతపురం : గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు. 23, 24 డివిజన్లో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర సహాయ కార్యదర్శి బి. రమణ అధ్యక్షతన నిరుపేద లబ్ధిదారుల అర్జీ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ….కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపుగా 7 నెలలు కావస్తున్న, సూపర్ సిక్స్ ను అమలు చేస్తామని ఒక పింఛన్ మాత్రమే ఇచ్చి ప్రచార ఆర్భాటాలు తప్ప మిగతా హామీలు అమలు చేయలేదన్నారు. అర్హులైన పేదలకు.చంద్రబాబు నాయుడు అధికారం లోకివచ్చి6.నెలలు పూర్తయినప్పటికీ ఇళ్లస్థలాలు గురించి మాట్లాడటం లేదన్నారు. ఇప్పటికి గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల స్థలాలు లేని పేదలు లక్షలాది మంది వున్నారన్నారు. వెంటనే అర్హత కలిగిన పేదలకు స్థలాలు తో పాటు ఇళ్ల నిర్మిచాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో వారి పార్టీల కోసం ప్యాలెస్ లు కట్టుకున్నారే కానీ పేదవారికి ఇల్లు కట్టించడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. అంతపురం నగరంలో వైకాపా ప్రభుత్వం అంతపురం పట్టణ ప్రజలకు 22 వేల ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయా ఇళ్లస్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యంకాని ప్రాంతాలలో కేటాయించడంతో అందులో చాలామంది పేదలకు ఇప్పటివరకు ఇళ్లస్థలాలు చూపలేదన్నారు. వైసిపి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలు, పట్టాలు నిరుపయోగంగా మారిందన్నారు. తాము అధికారంలోకొస్తే పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలు ఇస్తామని; ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల చొప్పున ఇస్తామని గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము, కంకర తదితర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా గృహ నిర్మాణానికి రూ. 5 లక్షలకు పెంచి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్లస్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో, గ్రామాల్లో నివాసయోగ్యంగా, గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలి అన్నారు.గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన లేఅవుట్లను మార్పుచేసి పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్లస్థలాలను కేటాయించాలి. రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ పారుదల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి ఒక్క దరఖాస్తు ఆన్లైన్లో ఎక్కించే బాధ్యత తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు వార్త కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజల పక్షాన పోరాడుతుందని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజల వద్ద నుంచి ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు పూర్తిచేసి తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర సహాయ కార్యదర్శి అల్లి పీరా సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు చాంద్ బాషా, నగర సమితి సభ్యులు ఖాజా మోహద్దిన్, గాజిలింగప్ప, సుందర్ రాజ్, నాగరాజు, ఈశ్వరయ్య, సుభాన్, తదితరులు ఫాల్గొన్నారు..