విశాలాంధ్ర – కడియం : బీజేపీ మండల కార్యదర్శి గా నియమితులైన భాస్కర్ ఇటువంటి అనేక ఉన్నత పదవులను పొందాలని, బీజేపీ అభివృద్ధికి భాస్కర్ తో సంఘం సభ్యులు వెన్నంటి ఉంటామని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మాచర గోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం బీజేపీ కార్యదర్శిగా నియమితులైన తాళాబత్తుల భవానీ భాస్కర్ ను అభినందిస్తూ విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర గోపాల కృష్ణ మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి, అభివృద్ది కి తోడ్పడే విశ్వబ్రాహ్మణులు నేటి సమాజంలో ఎంతో వేనుకబడి ఉన్నారని, వారికి తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మురమళ్ళ వీరభద్రరావు, గానుగుల కామేశ్వరరావు, పెదపూడి వేంకటేశ్వర రావు, కాకరపర్తి మల్లా చారి, ముత్యం, సున్నం వీరభద్రాచర్యులు, ఏలూరి బాలకృష్ణ, ఉచ్చింతల సత్యన్నారాయణ, అద్దాల భద్రరావు తదితరులు పాల్గొన్నారు
భాస్కర్ కు అభినందన సభ నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు
- Advertisement -
RELATED ARTICLES


