విశాలాంధ్ర- వలేటివారిపాలెం : నట్టల నివారణ మందుతో మూగ జీవాలలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జీవాలు సురక్షితంగా ఉంటాయని పశుసంవర్ధక శాఖ డాక్టర్ సుదర్శి సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చుండి గ్రామంలో డాక్టర్ సుదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుదర్శి సుధాకర్ మాట్లాడుతూ గొర్రెలు, మేకలకు నులి పురుగుల నివారణకు వాటి ఎదుగుదలకు నట్టల నివారణ మందులు ఎంతో అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమం జులై 10వ తేదీ వరకు ఉచితంగాసన్న జీవాలకు ముందు పంపిణీ జరుగుతుందని మూగజీవాల పెంపకందారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ ఉప్పుటూరి కిరణ్, చుండి ఆదర్శ పాఠశాల చైర్మన్ చొప్పర వసంతరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చొప్పర రాఘవులు తెలుగుదేశం నాయకులు చెరువుపల్లి సాంబయ్య, కామినేని అశోక్, చొప్పర బ్రహ్మయ్య, కామినేని అనిల్, గొర్ల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.