Homeఆంధ్రప్రదేశ్అభివృద్ధి పథంలో నిడదవోలు

అభివృద్ధి పథంలో నిడదవోలు

- Advertisement -

సమిష్టి కృషితో అభివృద్ధి పథంలో నిడదవోలు మండలం

విశాలాంధ్ర – నిడదవోలు : స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో అభివృద్ధి పదంలో నిడదవోలు మండలం పయనిస్తుందని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు తిరుమళ్ల భాగ్యలక్ష్మి దుర్గారావు అన్నారు. నిడదవోలు మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశం ఎంపీపీ తిరుమళ్ల భాగ్యలక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ  ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. ముందుగా మండల స్థాయి అధికారులు ప్రభుత్వ పథకాలు ప్రజలకుఅందుతున్న తీరును వివరిస్తూ పలు సమస్యలపై సమిక్షలు నిర్వహించారు. ఎంపీటీసీలు, సర్పంచులు అడిగిన పలు సమస్యలకు అధికారులు పరిష్కార మార్గాలను తెలిపారు. 24 గంటల పాటు వైద్యులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలంటూ, గృహ నిర్మాణ శాఖ, రెవిన్యూ శాఖలో ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ఎప్పటికప్పుడు సచివాలయాల ద్వారా ప్రజలకు తెలియపరచాలని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు జడ్పిటిసి కొయ్యే సూరిబాబు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గాలింకి జిన్నబాబు, వైస్ ఎంపీపీ కానుబోయిన ప్రభావతి, వడల రత్నకుమారి, ఎంపీడీవో టి వి సత్యనారాయణ పలు శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు