Homeఆంధ్రప్రదేశ్ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..జిల్లాలకు కొత్త ఎస్పీలు..

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..జిల్లాలకు కొత్త ఎస్పీలు..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా శనివారం రోజున ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. రాష్ట్రంలోని 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కసరత్తు పూర్తైన అనంతరం.. శనివారం ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించగా.. ఏడు చోట్ల కొత్తవారిని నియమించారు. మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు. మిగతా 12 జిల్లాల్లో పాత వారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, పల్నాడు జిల్లా ఎస్పీగా డి. కృష్ణారావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనాను నియమించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్‌ కునుగిలి, నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్‌ షెరాన్, బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమా మహేశ్వర్‌ను నియమించారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా అజితా వేజెండ్ల, విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్, తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు, గుంటూరు ఎస్పీగా వకుల్ జిందాల్, వైఎస్ఆర్ కడప ఎస్పీగా నచికేత్, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్ నియమితులయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు