జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజు అధికారి సుధీర్
విశాలాంధ్ర బ్యూరో అనకాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన బార్ విధానం 2025-28 లో భాగంగా జీవీఎంసీ, నర్సీపట్నం మునిసిపాలిటిల పరిధిలో నోటిఫై చేసిన బార్ & రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 14 నుంచి 17 తేదీ వరకు పొడిగించినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల దరఖాస్తు దారులు 5 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము , 10 వేల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి నిర్ణియత గడువు లోగా తమ దరఖాస్తును ఆన్ లైన్ లో https://oc.hpfsproject.com , హైబ్రిడ్ విధానం ద్వారా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజు ఆఫీసర్, అనకాపల్లి వారి కార్యాలయం లో సమర్పించడం ద్వారా బార్ & రెస్టారెంట్ కేటాయింపు కు సంబందించిన డ్రా లో పాల్గొవాలని సుదీర్ తెలిపారు.
బార్ ల కేటాయింపు డ్రా ఈనెల ఈనెల 18న ఉదయం 8.00 గంటలు
జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో తీస్తారని తెలిపారు. ఆసక్తి గలవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


