Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరిగిన కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి వేడుకలు..

ఘనంగా జరిగిన కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి వేడుకలు..

- Advertisement -

సిపిఎం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం: కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి వేడుకలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఎస్ హెచ్ భాష ,జె.వి రమణ, టి ఆయుబ్ ఖాన్, మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచి సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల పోరాటాలు నిర్వహించి, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలలో గెలుపొంది, చైర్మన్ గా గెలుపొంది ,విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. సిపిఎం పార్టీ నాయకునిగా రైతుల కోసం పేద బడుగు బలహీన వర్గ ప్రజల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించిన ఘనత సీతారం ఏచూరికీ దక్కిందన్నారు. ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలతో మంచి సంబంధాలు కొనసాగించాడని, ప్రపంచంలోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల దేశాలు పర్యటనలు జరిపి పరిష్కారం మార్గం చూపాడని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీ లతో అనేక రకాల విషయాలలో చర్చలు జరిపారని ,సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా మూడు పర్యాయాలు ప్రజలకు ,కార్మికులకు అనేక రకాల సంబంధించిన సమస్యల పైన పోరాటాలు నిర్వహించాడని తెలిపారు.రాజ్యసభ సభ్యునిగా కొనసాగి రాజ్యసభలో అనేక రకాల సమస్యలను లేవనెత్తి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి న ఘనత వారిదే అన్నారు. ఇటువంటి మహా నాయకుడు లేకపోవడంతో పార్టీకి తీరని లోటని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎల్ ఆదినారాయణ, ఎస్ హైదర్ వలీ ,వి వెంకట స్వామి, ఎస్ఎఫ్ఐ నాయకులు అమన్ శ్రీనాథ్ ,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు