Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపాముకాటుకు గురైన బిజెపి నాయకుడిని పరామర్శించిన మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

పాముకాటుకు గురైన బిజెపి నాయకుడిని పరామర్శించిన మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు దేవి రెడ్డి శంకర్ రెడ్డి పాముకాటుకు గురైన ఘటన పట్ల మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. బత్తలపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవి రెడ్డి శంకర్ రెడ్డిని వారు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి రైతులకు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం వైద్యులు అందించాలని వైద్యులకు తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పార్టీ తరఫున సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. బిజెపి పార్టీ కు చెందిన కార్యకర్తలు కు అండగా ఎప్పుడూ ఉంటామని తెలిపారు. ఏ కష్టం వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు