విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు విద్యార్థులకు గ్రంథాలయం వాటి ప్రాముఖ్యత, సమాజంలో నేటి పాత్ర తో పాటు చిత్రలేఖనం పైన పోటీలను నిర్వహించడం జరిగిందని గ్రంథాలయ అధికారి ని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నచ్చిన జాతీయ నాయకుని చిత్రాలు గీయడం జరిగిందని ప్రముఖుల వ్యక్తుల చేత సెమినార్లను నిర్వహించుట మోడ్రన్ డిజిటల్ లైబ్రరీ గురించి తెలపడం జరిగిందన్నారు. ముఖ్య అతిథులుగా ఎంఈఓ లు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ రామకృష్ణ విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ కమిటీ అధ్యక్షులు పెద్దన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రంధాలయ సిబ్బంది రాము, రమణ నాయక్ ,గంగాధర్, సరస్వతమ్మ, విద్యార్థులు 110 మంది పాల్గొనడం జరిగిందని తెలిపారు.
చిత్రలేఖనమునకు విశేష స్పందన.. గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
- Advertisement -
RELATED ARTICLES


