తనిఖీ చేసిన ఎంపీడీఓ శంకరరావు
హాజరు కాని పంచాయతీ కార్యదర్శి.
మొమో జారీ చేసిన ఎంపీడీఓ.
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని పోకూరు సచివాలయం ను ఎంపీడీఓ వై. శంకరరావు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు పట్టికను పలు రిజిస్టర్ లను పరిశీలించారు.ఉదయం 10:30గంటలకు పంచాయతీ కార్యదర్శి తప్ప మిగిలిన సచివాలయం సిబ్బంది హాజరైనారు. హాజరు కాని పంచాయతీ కార్యదర్శి యం. చంద్రశేఖర్ కి షాకాజ్ నోటీస్ జారీ చేశారు.ఈ సందర్బంగా సచివాలయం సిబ్బంది కి పలు చూచనలు చేశారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ వై. శంకరరావు మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. పని వేళల్లో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేసించిన మేన్ డేటరీ బయోమెట్రిక్, పెండింగ్ సిటిజన్ ఈ -కేవైసీ లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరవేయడంలో ఆలస్యం చేయరాదని అన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


