ఆమ్ ఆద్మీ పార్టీ.. ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ కుమ్మర
విశాలాంధ్ర ధర్మవరం;; భవిష్యత్తు తరాలు మేలు కోసం కుమ్మర కులస్తులు అందరూ ఐక్యమత్యంగా ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ కుమ్మర పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రస్థాయి శాలివాహన సమన్వయ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన గుంటూరులో జరిగిందని, తాను ముఖ్య అతిథిగా వెళ్లి పలు విషయాలను తెలియజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి కుమ్మర కుటుంబ సభ్యులు చేసే ప్రతి పని వేసే ప్రతి అడుగు విజయవంతం కావాలని తెలిపారు. కుమ్మర కులస్తులు కలిసిమెలిసి ఉంటూ రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మన కుమ్మరల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. అంతేకాకుండా కుమ్మర కులస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాము అని వారు తెలిపారు.
భవిష్యత్తు తరాలు మేలు కోసం కుమ్మర కులస్తులు అందరూ ఐక్యమత్యంగా ఉండాలి
- Advertisement -
RELATED ARTICLES


