Sunday, December 7, 2025
Homeజిల్లాలుకర్నూలుఇంటింటి చెత్త సేకరణ అమలు పై ఎంపీడీవో విజిట్

ఇంటింటి చెత్త సేకరణ అమలు పై ఎంపీడీవో విజిట్

- Advertisement -

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆస్పరి మేజర్ గ్రామపంచాయతీలో ఇంటింటి చెత్త సేకరణ వ్యవస్థ అమలు పరిస్థితిని బుధవారం ఉదయం ఎంపీడీవో గీతావాణి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎస్సీ కాలనీ సందర్శనలో ఎంపీడీవో గీతవాణి, పంచాయతీ కార్యదర్శి విజయరాజు లు డోర్–టూ–డోర్ గార్బేజ్ కలెక్షన్, శుభ్రత నిర్వహణ, చెత్త సేకరణ ప్రక్రియపై సిబ్బందితో సమాచారం తీసుకున్నారు. అవసరమైన చోట్ల పంచాయితీకి సిబ్బందికి తక్షణ సూచనలు జారీ చేశారు. గ్రామాల్లో శుభ్రత మెరుగుపడాలంటే ప్రజల్లో అవగాహనతో పాటు సహకారం కూడా కీలకమని ఎంపీడీవో గీతావాణి పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు