Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ కళాశాలల లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది..

ప్రభుత్వ కళాశాలల లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది..

- Advertisement -

ప్రిన్సిపాల్ వనితా వాణి
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ కళాశాలలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనిత వాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణము గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను పొందండి అనే కార్యక్రమాన్ని తాము నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో అధ్యాపకులు సునీత వనతి తాజ్ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం కూడా ప్రతి విద్యార్థికి పలు పథకాలు సౌకర్యాలు అందిస్తోందని కూడా వారు తెలిపారు. కావున పదో తరగతి ఉత్తీర్ణులైన తర్వాత విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ కళాశాలలో చేరాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు