విశాలాంధ్ర -నందిగామ : పట్టణాభివృద్ధి కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు బుధవారం పట్టణ పరిధిలో ఉన్న పాత బస్టాండ్ సెంటర్ బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్ వరకు 15 లక్షల రూపాయలతో మొత్తం డ్రైనేజ్ లో సిల్ట్ తొలగించే కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి తో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ బిల్డింగ్ వద్ద 15 లక్షల రూపాయలతో పూడికతీత పనులను ప్రారంభించినట్లు తెలిపారు అంతేకాకుండా పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగిందని ఇటీవల ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి మూడు కోట్ల 60 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు పట్టణంలో మౌలిక వసతుల కల్పనే ద్వేయంగా పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోవరాజు పట్టణ పార్టీ అధ్యక్షులు ఏచూరి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కాసర్ల లక్ష్మీనారాయణ కౌన్సిలర్లు కూటమి నేతలు విరివిగా పాల్గొన్నారు….
పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే….
- Advertisement -
RELATED ARTICLES


