Friday, January 16, 2026
Homeఆంధ్రప్రదేశ్భారత దేశ ఆత్మ గౌరవాన్ని ట్రంపు కు తాకట్టు పెట్టిన మోదీ

భారత దేశ ఆత్మ గౌరవాన్ని ట్రంపు కు తాకట్టు పెట్టిన మోదీ

- Advertisement -

జగన్ బాటలో చంద్రబాబు

కరెంట్ జోలికి వస్తే ప్రజలు బాబు కు షాక్ ఇస్తారు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో - తూర్పుగోదావరి  :  దేశంపై సుంకాలు అదనపు పన్నులు వ్యాపార లావాదేవీలు నిలిపివేస్తామని ట్రంప్ బెదిరింపులకు మోడీ తలవంచకూడదని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని భారత దేశ ఆత్మ గౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టవద్దని ఆయన అన్నారు... ట్రంపు వ్యాఖ్యలను పార్లమెంట్లో ఖండించకుండా దేశ ప్రజలను నవ్వులు పాలు చేశారని విమర్శించారు మోడీ ఘోరంగా విఫలమయ్యారని ఆయన అన్నారు మోడీ దేశ సంపదను బడ కార్పొరేట్ వ్యక్తులకు దోచుకు పెడుతున్నారని 2014 వరకు రూ 56 లక్షల కోట్ల అప్పు ఉంటుండగా మోదీ హాయంలో 200 లక్షల కోట్లకు చేరుకున్నాయని విమర్శించారు.

సిపిఐ తూర్పు గోదావరి జిల్లా 26 వ మహాసభలు సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రజా ప్రదర్శన స్థానిక చిట్టూరి ప్రభాకర్ చౌదిరి వేదిక సుబ్రమణ్య మైదానం లో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత న బహిరంగ సభ జరిగింది .

ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి మూడేళ్ళకు ఒకసారి పార్టీ రాష్ట్ర జాతీయ మహాసభలు జరుగుతున్నాయని, ఆయన అన్నారు మోడీ, చంద్రబాబు ల అసమర్ధ పాలనను ఎండగట్టారు. అయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా మనం మహాసభలు జరుపుకుంటున్నామని ఆగస్టు 20 తేదీనాటికి 26 జిల్లాలో మహాసభలు పూర్తి చేసుకుని ఆగస్టు 23,24,25 తేదీల్లో ఒంగోలు నగరంలో సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఘనంగా జరుపుకోబోతున్నామన్నారు. ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మన పార్టీ ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా మహాసభలు జరుగుతున్నాయని, సెప్టెంబర్ 22 నుంచి 25 తేదీల్లో చండీగఢ్ లో సిపిఐ జాతీయ మహాసభలు జరుపుకోబోతున్నామన్నారు. మన పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 26 నాటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శత వార్షికోత్సవాలు జరుపుకోబోతున్నామని, డిసెంబర్ 26వ తేదీన ఖమ్మం నగరంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నామని,. అలాగే పార్టీ ఆధ్వర్యంలోడిసెంబర్ 24,25 తేదీల్లో విజయవాడలో అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, . ప్రపంచ దేశాల్లోని ప్రముఖులంతా కూడా ఈ సమావేశానికి రానున్నారని చెప్పారు.
100 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటామని తెలియజేశారు. పార్టీకి వంద సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ అధికారంలోకి రాలేదని కొంతమంది అడిగితే
ప్రజల తరఫున నిలబడే పార్టీ సీపీఐ అని గర్వంగా తెలియజేస్తున్నాను. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉండే పార్టీ సిపిఐ పార్టీ అని తెలియజేశారు.

బ్రిటిష్ వారి అరాచక విధానాలపై కాంగ్రెస్ పార్టీతో పాటు, సిపిఐ పార్టీ కూడా పోరాడిందనీ, అనేకమంది తమ పార్టీ నాయకులు ఆ రోజుల్లో జైలు పాలయ్యారు, ఆస్తులు పోగొట్టుకున్నారన్నారు.
అలాగే సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్లు కూడా బ్రిటిష్ వారికి ఎదురెొడ్డి వారి అరాచక విధానాలకి వ్యతిరేకంగా పోరాడారన్నారు
కొట్లాదిమంది కష్టజీవుల కోసం పోరాడుతున్న పార్టీ తమ పార్టీ అని, విద్యార్థులు యువత మహిళ సమస్యలపై ప్రజాసంఘాలు పోరాడుతున్నాయనీ, కార్మికుల పక్షాన ఏఐటియుసి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు. ఈ దేశంలో ఉన్న లౌకిక రాజ్యాన్ని రక్షించడం కోసం తాము మహాసభల్లో చర్చించబోతున్నామన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశం అధోగతి పాలైందని,
ఇండియాకు పాకిస్తాన్కు యుద్ధం జరగాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అన్ని పార్టీలు బలిపర్చాయనీ అయితే మూడు దినాలు యుద్ధం చేసి ఎవరికీ తెలియకుండా ఆ యుద్ధాన్ని మోడీ ఆపేసాడన్నారు. కనీసం దీపావళి జరిగినన్నీ రోజులు కూడా ఆ యుద్ధం జరగలేదనీ, ఈ దేశంలో ఎవరిని సంప్రదించకుండా మోడీ యుద్ధాన్ని ఆపేసాడన్నారు.

ఇండియా పాకిస్తాన్ యుద్ధం తానే ఆపేశానని ట్రంప్ చెబుతుంటే మోడీ చేతకాని వాడిలా మౌనం గా ఉన్నాడన్నారు
ఒకప్పుడు ఇందిరా గాంధీ అమెరికాకి బయపడలేదు. పాకిస్తాన్తో యుద్ధం చేసింది. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి లాంటివాడే ఇందిరా గాంధీ ధైర్యాన్ని మెచ్చుకుని ఆమెను అపర కాళికగా అభివర్ణించాడు.
26 సార్లు డోనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని విమర్శిస్తుంటే ఈరోజున ఆయన ఆ పేరుని మన మోడీ
ఎత్తలేకపోతున్నాడన్నారు.
ప్రపంచంలో 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ట్రంప్ బెదిరిస్తున్నాడు. మనం ఎవరితో వ్యాపారం చేయాలో ట్రంప్ చెబుతాడట, ఒక బలహీనమైన ప్రధాని అమెరికాకు భయపడే ప్రధాని దేశాన్ని ఎలా నడపగలడని ఆయన ప్రశ్నించారు.
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏ రంగంలో ముందుకు వెళ్లామో మోడీ బహిరంగంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మోడీ రాకముందు 56 లక్షల కోట్ల అప్పు చేసాం. ఈ 11 ఏళ్ల కాలంలో 195 లక్షల కోట్ల అప్పు పెరిగింది, ఈ దేశానికి అప్పులు పెరిగాయి. ఈ దేశంలో మోడీ వచ్చిన తర్వాత అప్పులు పెరిగాయని, దీనికి బిజెపి వాళ్ళు
ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ గణంకాల ప్రకారం 56 శాతం రైతులు అప్పుల్లో ఉన్నారు. దీనికి మోడీ సమాధానం చెప్పాలి.
ఎన్నికల్లో ధరలు తగ్గిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదు. ప్రతి పరిశ్రమను అమ్మేస్తున్నారు.
11 సంవత్సరాలలో ఒక్క సమస్య అయినా మోడీ పరిష్కారం చేశాడా అని ఆయన ప్రశ్నించారు. కనీసం కోటి రూపాయల అవినీతి సొమ్మును కూడా వెనక్కి తీసుకు రాలేదని ఆయన విమర్శించారు.
ఒక్క విజయ మాల్యా తప్ప మిగతా వారంతా గుజరాత్ వాళ్లేనని, వీళ్లంతా కూడా బడా బాబులే, వీళ్ళందరికీ వేలాది కోట్ల రూపాయలు
మాఫీ చేసి మోడీ కార్పొరేట్ వారి కొమ్ము కాస్తున్నారని ఆయన విమర్శించారు. రైతులకు కాని, వ్యవసాయ కూలీలకు కాని, చేతి వృత్తులు చేసేవారికి కానీ ఎవ్వరికీ కూడా ఆ డబ్బు ఉపయోగ పడలేదంటే దానికి మోడీ సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నారు.
ప్రభుత్వ ధనాన్ని దోచుకుని విదేశాలకు వెళ్ళిపోతున్న వారిని మోడీ ప్రభుత్వం ఏమి చేయలేకపోయిందన్నారు.,
బాబా అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యం వల్లనే మనం ఈనాడు అందరం కలిసికట్టుగా ఉంటున్నాం కానీ బిజెపి వాళ్లు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారన్నారు. దేశం పురోభివృద్ధిని సాదించాలంటే మనమంతా ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రాల విషయానికొస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారని 14 మాసాలు గడిచిన డబుల్ ఇంజిన్ ఏం చేసిందో చంద్రబాబు నాయుడు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. 14 నెలల్లో లక్షా 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేసాడు, జగన్ ని మించిపోయాడు టోటల్గా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడన్నారు. అమరావతికి లక్ష ఎకరాలు కావాలంటున్నాడు ఎందుకంటే సమాధానం చెప్పడు, ఎయిర్పోర్ట్ కడతానంటాడు. రైల్వే స్టేషన్ ను 15 వందల ఎకరాల్లో కడతానంటాడు, చంద్రబాబు నాయుడుకి భూమి పిచ్చి పట్టిందని ఆయన విమర్శించారు ఇక పోలవరం డ్యామ్ ఎత్తు 46.7 మీటర్లు ఎత్తులో నిర్మిస్తేనే అది అందరికీ ఉపయోగపడుతుందని అయితే దాన్ని ఎత్తును తగ్గించాలని మోడీ చెప్పడంతో మన చంద్రబాబు నాయుడు దానికి సరే నంటూ ఎత్తు తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు.

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ దేశంలో మోడీ వచ్చిన తర్వాత గిరిజనులు దళితులు మైనార్టీ వర్గాల పై దాడులు పెరిగాయని ఆయన విమర్శించారు చట్టాన్ని చేతుల్లో తీసుకుని వెనకబడిన వర్గాలపై దాడులు చేస్తున్నారని ప్రజలు వీటిపై తిరగబడాలని పాలకులను ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకమైన గిరిజనులు కాల్చివేస్తున్నారని దేశంలో ఉన్న సహజ వనరుల సంపదను దోచుకోవడానికి ఆపరేషన్ కగార్ ప్రవేశపెట్టారని ఆమె అన్నారు

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని వీటిపై కార్మికులకు ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలని అదేవిధంగా కష్టజీవుల ఉద్యమాలకు అండదండలు అందిస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మహాసభలు జయప్రదం కావాలని ఆయన పిలుపునిచ్చారు

ఇంకా ఈ మహాసభలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లు కోండ్రపు రాంబాబు , రేఖ భాస్కరరావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సీపీఐ నగర కార్యదర్శి వీ కొండలరావు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు బి వీ వీ కొండలరావు ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు తోకల ప్రసాద్ జట్లు సంఘం కార్యదర్శి సప్పరమణ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి లావణ్య కే జ్యోతి రాజు, చింతలపూడి సునీల్ పి త్రిమూర్తులు కే శ్రీనివాస్ ప్రజనాట్యమండలి ఉమ్మడి జిల్లా నాయకులు శ్యామ్, నౌరుజి, ఉమా ప్రేమానందం నాగబాబు ఆధ్వర్యంలో కళా రూపాలు ప్రదర్శించారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు