విశాలాంధ్ర నందిగామ:-రామాయణ మహా గ్రంథాన్ని రచించిన కవయిత్రి మొల్లబాంబ జయంతి కార్యక్రమాలను నందిగామ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మండల శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్,శాలివాహన సంఘం నాయకులు తొర్లికొండ సీతారామయ్య,టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి కాసర్ల లక్ష్మీనారాయణ తో కలిసి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణ మహా గ్రంధాన్ని రచించిన కవయిత్రి మొల్లమాంబ ఎంతో పుణ్యం చేసుకున్నారని పేర్కొన్నారు మొల్లమాంబ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘ నాయకులు తొగటి నరేష్ కుమార్,తొర్లికొండ శ్రీనివాసరావు,కోరంపల్లి వీరబ్రహ్మం,బొమ్మన సురేష్,టి రాజారావు,కళ్యాణం మాధవి, బెజవాడ వెంకట్రావమ్మ, సిరివెళ్ల రామకృష్ణ,దివ్వెల వీరభద్రరావు,ఎస్ క్రాంతి కుమార్,తొర్లికొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మొల్లమాంబ జయంతి కార్యక్రమం…
RELATED ARTICLES