డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఈ బీ దేవి
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా మరింత పటిష్టమైన నిఘా పెంచాలని పి సి పి ఎన్ డి టి చట్టం అమలు సలహా కమిటీలో డి ఎం అండ్ హెచ్ ఓ
డాక్టర్ ఈ బీ దేవి తీర్మానం చేశారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిఎంహెచ్వో డాక్టర్ ఈ .బి. దేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం-అనంతపురం జిల్లాలో అమలు అనే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జిల్లాలో 188 స్కానింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయని , వీటిని వైద్య ఆరోగ్య బృందాలు తరచూ తనిఖీలు చేసి లింగ నిర్ధారణ జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మరో 9 స్కానింగ్ సెంటర్లు కొత్తవి ప్రారంభించేందుకు, 12 కు రెన్యువల్ అనుమతి ఇచ్చేందుకు, మరో 20 స్కానింగ్ సెంటర్ల లో సిబ్బంది, యంత్రాల మార్పులకు సమావేశం ఆమోదం తెలిపారు. బాల్య వివాహాలు, టీనేజ్ గర్భాలు జరగకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ ,వైద్యశాఖ, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషిచేసి వాటి తగ్గింపులో ముందుండాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డిటి హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దుర్గేష్, చిన్నపిల్లల వైద్య నిపుణులు రవికుమార్, ప్రభుత్వ గైనకాలజిస్ట్ ఇందిరా ప్రియదర్శిని, రెడ్ సంస్థ ప్రతినిధి అనిత, పెథాలజీ ప్రొఫెసర్ పూర్ణచంద్రశేఖర్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ జయలక్ష్మి, నాగ శశిభూషణ్ రెడ్డి, విష్ణుమూర్తి, సురేందర్ రెడ్డి, జిల్లా మాస్ మీడియా అధికారి ఈ. నాగరాజు, డిపిహెచ్ఎన్ఓ ప్రమీల దేవి, లీగల్ కన్సల్టెంట్ సంధ్యారాణి డిప్యూటీ మాస్ మీడియా అధికారి లక్ష్మీనారాయణ, స్టాటిస్టికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఆరోగ్య విద్యాధికారి గంగాధర్, డెమో సిబ్బంది వేణుగోపాల్, ఆషా రాణి, , వెంకటేశ్వరరావు,కిరణ్, , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్ లపై మరింత నిఘా పెంచాలి
- Advertisement -


