. బ్రాంచ్ మేనేజర్ సి. నారాయణ రెడ్డి
విశాలాంధ్ర-రాప్తాడు : ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం బ్రాంచ్ మేనేజర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.
మండలంలోని మరూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖను పిఎసిఎస్ డైరెక్టర్ గోపాల్ నాయుడు సీనియర్ మేనేజర్లు జి.చైతన్య కుమార్, సిహెచ్ కె.వి శ్రీధర్ మేనేజర్ బి.రెడ్డప్ప, అసిస్టెంట్ మేనేజర్ బి.దుర్గన్న, సొసైటీ చైర్మన్ మరూరు గోపాల్ తో కలిసి శనివారం ప్రారంభించారు. మేనేజర్ మాట్లాడుతూ మరూరు గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా రైతులకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ఈ శాఖను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో బ్యాంకింగ్ పనుల కోసం కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వచ్చేదని, ఇకపై ఆ ఇబ్బందులు తప్పుతాయన్నారు.
రైతులకు ప్రాధాన్యం: పంట రుణాలు, పావలా వడ్డీ పథకాలు మరియు ప్రభుత్వ రాయితీలు నేరుగా లబ్ధిదారులకు అందుతాయన్నారు. మహిళా పొదుపు సంఘాల లావాదేవీలకు ఈ శాఖ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. దిభవిష్యత్తులో ఏటీఎం ఏర్పాటు చేస్తామని, సేవలతో పాటు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యాలను కూడా గ్రామస్తులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్యాషియర్ ఆర్.ఆదికేశవ నాయుడు, సాగునీటి సంఘం అధ్యక్షులు ఉమాపతి టి.వెంకటేష్, గ్రామ సర్పంచ్ నారాయణస్వామి, మాజీ డీలర్ సూర్యనారాయణ కొండారెడ్డి, కేశవయ్య, కదిరప్ప నరేష్, చాపట్ల చెండ్రాయుడు భగవంత్, రామానాయుడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


