విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ రెండవ రోజు పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు కేశగాల వెంకటేష్ జయశంకర్ ప్రదీప్ గణేష్ కళ్యాణ్ తదితర నాయకులు మంత్రిని కలిసి ధర్మవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం లేనంతవలన, భావన నిర్మాణానికి స్థలం కేటాయించి, ప్రభుత్వ నిధులతో భవనాన్ని నిర్మించాలని కోరుతూ వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు అర్జీల రూపంగా సమర్పిస్తున్న కూడా ప్రభుత్వము గాని, రాజకీయ పార్టీ ప్రతినిధులు గాని స్పందించకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. కావున ధర్మవరం పట్టణంలో ఎక్కడైనా సరే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నిర్మించాలని వారు విజ్ఞప్తి చేశారు. పట్టణములోని ఎర్రగుంట ఎల్ సి కె పురమునందు గతంలో ప్రభుత్వం వారు నడుపుతున్నటువంటి పాలకేంద్రం ప్రస్తుతం మూతపడిందని, కాబట్టి సర్వేనెంబర్ 649 లోని ఖాళీగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనమును నిర్మించే దిశగా మంత్రిగా మీరు సహకరించాలని వారు కోరారు. అనంతరం మంత్రి స్పందిస్తూ తమ సమస్యను త్వరలోనే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని ఎమ్మార్పీఎస్ మంత్రికి వినతి
- Advertisement -
RELATED ARTICLES


