Homeజాతీయంభారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు

భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు

- Advertisement -

న్యూదిల్లీ: భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. దీనికి కారణం…జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయడమే. దీనిపై నెట్టింట భారత్ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో నష్టనివారణ చర్యలకు దిగింది. బుధవారం ఎయిర్‌లైన్స్ తన సోషల్ మీడియాలో ఒక మ్యాప్‌ను పంచుకుంది. అందులో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు పాక్ భూభాగంలో భాగంగా చూపించింది. ఈ పోస్టు తెగ వైరల్ అవగా…భారత నెటిజన్ల నుంచి విమర్శలు వెళ్లువెత్తాయి. ‘బాయ్‌కాట్ నేపాల్ ఎయిర్‌లైన్స’ అనే హ్యాష్‌ట్యాగ్ తెర పైకి వచ్చింది. భారత విదేశాంగశాఖ, విమానయాన మంత్రిత్వశాఖలు నేపాల్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. భోజ్‌పుర్ నటుడు, గాయకుడైన ఖేసరిలాల్ యాదవ్ స్పందిస్తూ…ఈ చర్య రెచ్చగొట్టేదిగా ఉందని ట్వీట్ పెట్టారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా ఉందన్నారు. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో నేపాల్ ఎయిర్‌లైన్స్ తన పోస్టును డిలీట్ చేసింది. తన మ్యాప్‌లో అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించిన విషయాల్లో తప్ప్పులు జరిగాయని అంగీకరిస్తూ… భారత్‌కు క్షమాపణలు చెప్పింది. జరిగిన తప్పిదంపై అంతర్గత సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే భారత విదేశాంగశాఖ దీనిపై ఇంకా స్పందించలేదు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు