- Advertisement -
నేపాల్‌లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ముదురుతోంది. సోషియల్ మీడియాపై విధించిన నిషేధం ఎత్తివేసినప్పటికీ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ దేశ పాలన సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో చర్చించగా, ఈ క్లిష్ట పరిస్థితులను నియంత్రించేందుకు,తనను సురక్షితంగా ప్రభుత్వ నివాసం నుంచి తరలించేందుకు మిలిటరీ సహాయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది.


