విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వలసలు వద్దు – ఉపాధి పనులు ముద్దు అని ఎవరూ కూడా వలసలు వెళ్లకుండా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సచివాలయ – 2 పరిధిలో ఉపాధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూలీలు ఖచ్చితమైన కొలతలతో పనులు చేసి చేస్తే రోజుకు 321 రూపాయలు వేతనం పొందవచ్చునని తెలిపారు. గ్రామాల్లో కూలీలు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉపాధి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. కావున ప్రతి కూలీ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, కోసిగి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న, టౌన్ అధ్యక్షులు మల్లికార్జున, నాయకులు ఆదాము, ఆశన్న, దేవసహాయం, హనుమంతు, రామన్న, కూలీలు పాల్గొన్నారు.


