Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుట వైద్యుల ముఖ్య లక్ష్యం..

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుట వైద్యుల ముఖ్య లక్ష్యం..

- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు సంకారపు నరసింహులు

విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించుట వైద్యుల యొక్క ముఖ్య లక్ష్యము అని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు సంకారపు నర్సింలు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయములోని పలు రికార్డులను వారు పరిశీలించారు. హాజరు పట్టిలు కూడా పరిశీలించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపితోపాటు ఇతర వార్డులను కూడా వారు పరిశీలించారు. తదుపరి స్క్రబ్ టైఫాస్ట్ వ్యాధికి గురి అయ్యి కోరుకుంటున్న శాంతమ్మను వారు పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మీకు నాణ్యమైన వైద్యం అందుతుందని వారు తెలిపారు. తదుపరి శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ భోజనపు పాకెట్లను వారి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు