మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు వైద్యుల చేతులమీదుగా పళ్ళను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతగా పేరు ఇష్టపడని దాత ఇవ్వడం పట్ల వారికి పరోక్షంగా కృతజ్ఞతలను తెలియజేయడం జరిగిందని తెలిపారు. గర్భిణీ స్త్రీలు నెలవారీగా వైద్య చికిత్సలు పొందుతూ, ప్రసవాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేసుకోవాలని తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు వర్తిస్తాయని తెలిపారు. గర్భిణీ స్త్రీలు ప్రశాంతమైన జీవనముతో పాటు పౌష్టిక ఆహారము తీసుకుంటూ, కుటుంబ సభ్యులు కూడా చేదోడు ఓదుడుగా ఉంటూ గర్భిణీ స్త్రీల పట్ల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మంజనాత్, సలహాదారు మనోహర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీలు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..
- Advertisement -
RELATED ARTICLES


