విశాఖ పట్నం; మకర సంక్రాంతి సందర్భంగా స్వచ్ఛంధ సంస్థ’చారిటీ బాక్సు’ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిరుపేదలకు నిత్యావసరాలు అందజేశారు. విశాఖనగరం, యలమంచిలి, పాయకరావుపేట, శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట, చాపర, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లలోని యద్దనపూడిలో ఈ వితరణ చేపట్టారు. విశాఖపట్నం సిటీలో ప్రధానంగా పాత పోస్టాఫీసు దగ్గర నివాసం ఉంటున్న పేదలకు, పెదవాల్తేరు, తాటిచెట్లపాలెం, శివాజీపాలెం తదితర ప్రాంతాలలో ఎంపిక చేసిన నిరాశ్రయులకు నిత్యావసరాలు అందజేశారు. ఒక్కో కిట్లో 15 రకాల వస్తువులు, 15 కేజీల సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చారిటీ బాక్సు ప్రతినిధి కోశాధికారి పొట్నూరు వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పేద, ధనిక తేడా లేకుండా పండుగ మూడు రోజులు అందరూ సంతోషంగా గడుపుతారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత దయనీయంగా జీవనం గడుపుతున్న కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి ఈ నిత్యావసరాలు అందజేశా మన్నారు. ఈ సందర్భంగా చారిటీ బాక్సు ట్రస్టీ తాడికొండ కరుణాకర్ మాట్లాడుతూ చారిటీ బాక్సు ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు నిరుపేదల పక్షానే నిలిచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో చారిటీ బాక్సు తరుపున సేవా కార్యక్రమాలు చేస్తున్నా మన్నారు. అమలాపురంలో కొప్పుల భాస్కరరావు ఆధ్వర్యంలో నెలలో రెండు సార్లు అన్నదానం చేస్తున్నామన్నారు. చారిటీ బాక్సు ప్రతినిధులు బెల్లాన తిరుపతిరావు, ఉరిటి శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యంత నిరుపేదలకు ఈ నిత్యావసరాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో కొంతం శ్రీకాంత్, పొట్నూరు వెంకట సాత్విక, లక్కోజు నూకరాజు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతిని సందర్భంగా నిరుపేదలకు ‘చారిటీ బాక్సు’ సాయం
- Advertisement -
RELATED ARTICLES


