Homeఆంధ్రప్రదేశ్ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. పిడుగులతో కూడిన వర్షాలు

- Advertisement -

ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం , అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు అక్కడక్కడ వర్షాలు పడుతాయని తెలిపింది.గజపతినగరం, శృంగవరపుకోట, భీమునిపట్నం పరిసిర ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు , అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి చెదురుముదురు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని వెల్లడించింది. వర్షాలు, పిడిగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు