Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

- Advertisement -

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్ ఫౌండేషన్ అధ్యక్షుడు షీలా నాగేంద్ర, కార్యదర్శి ఆర్. జయరాం, కోశాధికారి వంకదారి మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత ఐ.ఓ.ఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు సికే శ్రీరాములు జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కంటి వైద్య శిబిరము యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ.. శ్రీ సత్య సాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 90 మంది కంటి రోగులు పాల్గొనగా కంటి వైద్య చికిత్సలు అందించిన పిదప 408 మంది ఆపరేషన్కు ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుంకు సుకుమార్ సహకారదర్శి రమేష్ బాబు, పి ఆర్ ఓ రాధాకృష్ణ, క్యాంపు చైర్మన్ ఖలీల్, రెహమాన్, చాంద్ బాషా, సత్రశాల మల్లికార్జున, వై కే శ్రీనివాసులు, కోటేశ్వరరావు, షేక్ సికిందర్, నామాల శ్రీనివాసులు, కేతా లోకేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు