Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఓట్లు మావి – సీట్లు మీవా? బహుజనుల రాజకీయ సాధికారతే బీఎస్పీ లక్ష్యం: సాకే వినయ్...

ఓట్లు మావి – సీట్లు మీవా? బహుజనుల రాజకీయ సాధికారతే బీఎస్పీ లక్ష్యం: సాకే వినయ్ కుమార్

- Advertisement -

ధర్మవరం; కూటమి నాయకులపై బీఎస్పీ నేతలు తీవ్రంగా విమర్శించారు. సందర్భంగా పట్టణములోని ఆర్ సి జి మాల్ లో బహుజన సమాజ్ పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా ముఖ్య నాయకులతో సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ
కూటమి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతానికి నూతన జిల్లా కమిటీతో పాటు నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.నూతన జిల్లా కమిటీ,అధ్యక్షుడు: సాకే వినయ్ కుమార్,ఉపాధ్యక్షుడు: హనుమంతు,ప్రధాన కార్యదర్శి: వాల్మీకి ప్రసాద్,కార్యదర్శి: ఖాదర్ బాషా,జిల్లా ఇంచార్జ్: సుబ్బారాయుడు కోశాధికారి: ఇందీవర్.ఈసీ సభ్యులు: భూక్యా దేశ్ నాయక్, అక్కిం నవీన్ కుమార్, నరసింహమూర్తి, నరసప్ప, సురేంద్ర నాయుడు కమిటీ ఎంపిక చేసిన జరిగిందన్నారు..అనంతరం రాష్ట్ర కార్యదర్శి అంపావతి గోవిందు, వాల్మీకి ప్రసాద్, ఖాదర్ బాషా మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో విద్య, వైద్యం, రైతాంగ రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఎన్నికల హామీలు అమలు కాలేదని ఆరోపించారు. బీసీలు, దళితులు, మైనారిటీలకు న్యాయం జరగడం లేదన్నారు.“ఓట్లు మావి – సీట్లు మీవా?” అనే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతోందని, బహుజన వర్గాల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఎస్పీయేనని పేర్కొన్నారు. జూన్ నెల 11న అనంతపురంలో జరిగే బీఎస్పీ జోనల్ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ హాజరవుతున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, బండి ఆదినారాయణ, అబజిత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు