Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాయింట్ కలెక్టర్, ఎస్పీలను కలిసిన పరిటాల శ్రీరామ్.

జాయింట్ కలెక్టర్, ఎస్పీలను కలిసిన పరిటాల శ్రీరామ్.

- Advertisement -

పలు అంశాల గురించి చర్చ

విశాలాంధ్ర- ధర్మవరం; అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ లతో ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. అనంతపురంలో క్యాంప్ కార్యాలయానికి వచ్చి జేసీని ఆయన ఛాంబర్ లో కలిశారు. తాజాగా ఆయన శ్రీ అన్నమయ్య జిల్లాకు బదిలీ అయిన నేపథ్యంలో శ్రీరామ్ కలిశారు. జిల్లాలో బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల అభివృద్ధికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను పుట్టపర్తిలోని ఎస్పీలో కార్యాలయంలో కలిశారు. ధర్మవరం నియోజవర్గంలోని పలు అంశాల గురించి చర్చించారు. శాంతి భద్రతల విషయంలో తమ వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని శ్రీరామ్ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ కుమార్ ను కూడా పరిటాల శ్రీరామ్ కలిశారు. ఆయన సీజీఎంగా పదోన్నతి పొందగా.. పుట్టపర్తి లోని సాయి ఆరామంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. జిల్లాలో విశేషమైన సేవలందించారని.. ఇందుకు ప్రజల తరుఫున శ్రీరామ్ కృతజ్ఞతలు చెప్పారు. జేసీ, ఎస్పీ, ఎస్ఈలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు