- Advertisement -
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన సాలె ధనుంజయ గ్రూప్ – 2 ఫలితాల్లో ప్రతిభ చాటి జోన్ – 4 ఎక్సైజ్ ఎస్ఐగా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన ధనుంజయ తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయం వద్ద చిల్లర కొట్టు నడుపుతూ కుమారుడిని బీటెక్ వరకు చదివించారు. అమ్మ నాన్నల కష్టాన్ని గుర్తించిన ధనుంజయ పట్టుదలతో చదివి గ్రూప్ – 2 లో విజయం సాధించారు. సామాన్య కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆతనిని స్థానికులు అభినందించారు.


