Homeఆంధ్రప్రదేశ్మా సొసైటీకి యూరియా కేటాయించండి సారూ!

మా సొసైటీకి యూరియా కేటాయించండి సారూ!

- Advertisement -

మా సొసైటీకి యూరియా కేటాయించండి సారూ

విశాలాంధ్ర – సీతానగరం:  మా సొసైటీకి యూరియా కేటాయించండి సారూ అంటూ రైతులు వినతి పత్రం సమర్పించారు. రఘుదేవపురం గ్రామ పంచాయితీ సొసైటీలో త్రీ సభ్య కమిటీ, రైతులు మండల వ్యవసాయ అధికారిని గౌరీ దేవికి వినితి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రఘుదేవపురం గ్రామ సొసైటీ పరిధిలో సుమారు మూడు వేల ఎకరాల ఖరీఫ్ వరి సాగు జరుగుతుంది అని అన్నారు. ఇప్పటివరకూ 2442 యూరియా బస్తాలు వచ్చి ఉన్నది ఇంకా 3558 అవసరం అనగా 60 టన్నుల ఉందని అంటే ఒకో రైతుకు ఎకరానికి రెండు బస్తాలు చప్పున అందించాలని అన్నారు. కావున వ్యవసాయ అధికారులు రైతులకు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మా సొసైటీకి యూరియా కేటాయించాలని అని వినతి పత్రం సమర్పించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కవల గంగాధరరావు, సభ్యులు పెందుర్తి విజయ్ భాస్కర్, వాతాడ సత్తిబాబు, గ్రామ రైతులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు