Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన ఆర్డీవో మహేష్

స్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన ఆర్డీవో మహేష్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; మండల కేంద్రంలో ఉన్న మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఆకస్మికంగా ఆర్డీవో మహేష్ తనిఖీ నిర్వహించారు. అనంతరం వారు గోదాం లో నిల్వలో ఉన్న నిత్యావసర వస్తువులు (బియ్యం, చెక్కెర, మొదలైనవి) ని పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించారు. సరుకుల లభ్యత , పంపిణీ వివరాలను క్రాస్ చెక్ చేశారు. గోదాం నిర్వహణ, సరుకుల నిల్వ పరిస్థితులు, పరిశుభ్రత, తూకం యంత్రాల వాడకాన్ని పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం సిబ్బందిని ప్రశ్నించి, విధులు పూర్తిగా నిబద్ధతతో నిర్వర్తించాలని ఆదేశించారు.
అలాగే, ప్రజలకు నిత్యావసర సరుకులు సమయానికి, పారదర్శకంగా అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని హెచ్చరించారు. సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని వారు స్పష్టం చేశారు. తనిఖీలో గుర్తించిన అంశాలపై తక్షణ చర్యలు తీసుకుని సర్దుబాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు