తపోవనం సర్కిల్‌లో సీపీఐ శ్రేణుల రాస్తారోకో.. పలువురి అరెస్టు
విశాలాంధ్ర అనంతపురం సిటీ: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మిక, కర్షక, రైతాంగ, వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా సోమవారం సిపిఐ నాయకులు చేపట్టిన జైల్ బరో కార్యక్రమంలో భాగంగా నగరంలోని తపోవనం సర్కిల్లో నేషనల్ హైవేని దిగ్బంధించారు.
పోలీసులు నేషనల్ హైవే దిగ్బంధాన్ని అడ్డుకొని అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. పోలీసుల నిరంకుశ వైఖరి నశించాలి. పోలీసులు ప్రభుత్వాల చుట్టాలుగా ప్రజల కోసం కాకుండా ప్రభుత్వాలకు పనిచేయడాన్ని పూర్తిగా తప్పు పట్టారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మికుల పట్ల నిరంకుశ వైఖరి నశించాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ కార్పొరేట్ సెక్టార్కు పట్టం కట్టాడు. దీనిని తిప్పి కొట్టేందుకే దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల రైతాంగ వ్యవసాయ కార్మిక సంఘాలు జైలు బరో కార్యక్రమం చేపట్టామన్నారు. అన్ని పంటల ఉత్పత్తుల ఖర్చులపై 50% మద్దతు ధర ఇవ్వాలి. కార్మికులందరికీ రూ. 31 వేలు కనీస వేతనం ఇవ్వాలి. లేబర్ కోడ్ లు రద్దుచేసి కార్మిక చట్టాలు కొనసాగించాలి. స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. పంట రుణాలు తక్షణమే విడుదల చేయాలి కరువు సహాయక చర్యలు చేపట్టాలి. ఉపాధి హామీ పనులు 200 రోజులు చేపట్టాలి రోజుకు రూ. 700 కూలి ఇవ్వాలి. పట్టణ ఉపాధి హామీ పథకం ప్రారంభించాలి. స్టీల్ ప్లాంట్ మున్సిపాలిటీ విద్యుత్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలి. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకుని వచ్చి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరుని పర్మనెంట్ చేయాలన్నారు. కార్పొరేటర్లు బలవంతపు భూసేకరణ ఆపాలి. చెమటోడ్చి పనిచేసే కార్మికుల సమస్యలు పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలు కార్మికులు అందరూ సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జే రాజారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సి మల్లికార్జున, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్ర, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. రాజేష్ గౌడ్, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు నాగరాజ్, ఏఐసీసీ టియు జిల్లా నాయకులు వేమన, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగరాజు, ఏఐటియుసి నగర అధ్యక్ష కార్యదర్శులు జి చిరంజీవి, వి.కృష్ణుడు, సిఐటియు జిల్లా నాయకులు గోపాల్, వెంకట్ నారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నప్ప యాదవ్, ఏఐటియుసి నాయకులు రాజు, వెంకటేష్, రామకృష్ణ, కృష్ణ నాయక్, ఐ ఎఫ్ టీ యు దావీదు, చంద్రశేఖర్, శివకృష్ణ, వేణుగోపాల్, వెంకటేష్, అక్బర్ వలి, పీర, కృష్ణారెడ్డి, దామోదర్, షరీఫ్, నరసింహులు రమేష్ నాయక్, రామాంజనేయులు, తిమ్మప్ప, సీఐటీయూ జిల్లా నాయకులు సీన తదితరులు పాల్గొన్నారు.


