Homeజిల్లాలువిజయనగరంఎమ్మెల్యే ‘కోండ్రు' ను ఆహ్వానించిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

ఎమ్మెల్యే ‘కోండ్రు’ ను ఆహ్వానించిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలం శ్యాంపురం గ్రామంలోని శ్రీ గాయత్రి శ్రీనివాస అగ్రహారంలో వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 26 వ తేదీన ‘భారీస్థాయిలో శ్రీ శ్రీనివాసా కళ్యాణం’ జరుపనున్నట్టు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ కు తెలిపారు. శుక్రవారం రాజాంలో టీడీపీ కార్యాలయంలో సంఘం గౌరవాధ్యక్షులు కెవిఎస్ కెజె శర్మ, అధ్యక్ష, కార్యదర్శులు రంప జగదీశ్వరరావు శర్మ, కొల్లూరు తిరుమలేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి గురువాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నంది సూర్య ప్రకాష్ ఎమ్మెల్యే ను కలిసి, కళ్యాణం వివరాలు తెలియజేసారు. తిరుపతిలో జరుగుతున్న విధంగా ఆ రోజు ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం కళ్యాణం అయ్యేవరకు సుప్రభాతసేవ, తోమాలసేవ, అర్చన, అభిషేకం, శ్రీనివాస వ్రతం, సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ, అనంతరం కళ్యాణం. ఆ తరువాత పవళింపు సేవ ఉంటాయని ఎమ్మెల్యేకు తెలిపారు. కార్యక్రమంలో సుమారు 5 వేల మంది భక్తులు పాల్గొనేలా కార్యక్రమం నకు పనసవలస పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ తిరుమల రంగనాధం రూపకల్పన చేసారన్నారు.
‘గోటి వొలుపు’ బియ్యంతోనే కళ్యాణం అక్షింతలు ఈ సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం కు ‘గోటీ వొలుపు’ అక్షింతలు వాడే విధంగానే, అగ్రహారంలో జరుగనున్న కళ్యాణంలో కూడా ‘గోటి వొలుపు’ అక్షింతలు కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు, ఈ నెల 27 వ తేదీన శ్యాంపురం గ్రామంలో గ్రామస్తుల నుంచి ధాన్యం సేకరణ చేపట్టి, 30 వ తేదీ ముక్కోటి ఏకాదశి రోజు నుంచి ‘గోటి వొలుపు’ కార్యక్రమం చేపట్టనున్నట్టు ఎమ్మెల్యేకు ప్రతినిధులు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ చాలా మంచి కార్యక్రమం చేపట్టారంటూ అభినందించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ చాలా మంచి కార్యక్రమం చేపట్టారంటూ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు