విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఆదర్శనగర్లో పలు ప్రాంతాలు రాత్రి వేళ అంధకారంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ నాయకులు గంది గోపి, మరిపి జగన్మోహన్రావు మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఏ. రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్, అంధకారంగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలని ఏఈ సాయి కిరణ్కు ఆదేశాలు జారీ చేశారు.
కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది అప్పలరాజు, గణపతి వెంటనే చర్యలు చేపట్టి ఆయా ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సమస్యపై స్పందించిన టీడీపీ నాయకులు మరియు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆదర్శనగర్లో వీధిలైట్లు ఏర్పాటు చేయించిన టీడీపీ నాయకులు
- Advertisement -


