రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ నిర్వాహకులు కన్నావెంకటేష్.
విశాలాంధ్ర ధర్మవరం;; మానవసేవే మాధవ సేవ అని, అన్నదానం మహాదానముతో సమానమని రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి కొడుకులు లేని పితృదేవతల అకాల మరణం చెందిన వారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. దాదాపు 120 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ధర్మారానికి చెందిన చేపూరు మహేష్ నేత సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పంపిణీ జరిగిందని తెలిపారు. అనంతరం దాతలకు కన్నా వెంకటేష్ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కేత లోకేష్, చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మానవసేవే మాధవసేవ
- Advertisement -
RELATED ARTICLES


