విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 21న ధర్మవరం పట్టణంలో పల్స్ పోలియోను విజయవంతం చేయుట అందరి బాధ్యత అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోతో పాటు ఇంచార్జ్ డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ చెన్నారెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు తో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ పోలియో రహిత ధర్మవరంగా అందరి సహకారంతో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.0-5 సంవత్సరాలలోపు పుట్టిన వారందరికీ కూడా ఈ చుక్కలను వేయించాలని, వారి భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు రావు అని వారు తెలిపారు. ఈనెల 21వ తేదీన ఎవరైనా పల్స్ పోలియో చుక్కలు వేయించుకొని వారు ఎవరైనా ఉంటే సిబ్బంది డిసెంబర్ 22వ తేదీ 23వ తేదీన ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలను వేస్తారని తెలిపారు. రెండు పోలియో చుక్కలతో పోలియో పై విజయం సాధిస్తామని తెలిపారు. కుటుంబంలోని పిల్లల కు రక్షణ కల్పించడంలో తల్లిదండ్రులు ఎవరు తప్పులు చేయరాదని తెలిపారు. పోలియో మోతాదును ప్రతిసారి ఇవ్వండి పోలియోపై విజయం సాధించుటలో దేశానికి తోడ్పడాలని వారి పిలుపునిచ్చారు.
పల్స్ పోలియోను విజయవంతం చేయుట అందరి బాధ్యత.. ఆర్డీవో మహేష్
- Advertisement -
RELATED ARTICLES


