ఎంఈఓ -1 రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించడం జరిగిందని ఎంఈఓ -1 రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో 48 విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రయోగాలను కూడా చక్కగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. తదుపరి ప్రతిభ ఘనపరిచిన వారు జిల్లా లెవల్ కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. జిల్లా లెవల్ కు ఎంపికైన వారిలో ఎన్. గణేష్, ఈ. భాగ్యలక్ష్మి, యు. నితీష్ కుమార్, వై. హరినాథ్, జి. చైతన్య, సీ.తను శ్రీ, ఎం. మధుచంద్ర, అలాగే ఇండిజువల్ విద్యార్థిగా ఎం. మధుచంద్ర, ఎంపిక కావడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ రాంప్రసాద్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లు పాల్గొన్నారు.


