- Advertisement -
దాత లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మోడల్ స్కూల్ లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు దాత లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ చేతులమీదుగా విద్యార్థులకు మెటీరియల్స్ ను అందజేయడం జరిగిందని ప్రిన్సిపాల్ పద్మశ్రీ, పాఠశాల చైర్మన్ నాగేంద్ర తెలిపారు. అనంతరం వరకు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇటువంటి స్టడీ మెటీరియల్ ఇవ్వడం పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందుకు సహకరించిన టీచర్ రమేష్ ను కూడా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


