విశాలాంధ్ర ధర్మవరం ; మానవతను మరోసారి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా పట్టణములోని పూజారి లక్ష్మయ్య 55 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అనుకోకుండా మృతి చెందాడు. ఈ విషయాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి స్థానికులు తెలిపారు. దీంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, డైరెక్టర్ రామకృష్ణ విజయభాస్కర్ సభ్యులు వెంకటేష్ సోమశేఖర్ రాజు ఇతరులు అంత్యక్రియ ఏర్పాట్లను స్వయంగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అంతిమయాత్రలు కూడా పాల్గొనడం జరిగింది. మృతి చెందిన వ్యక్తి రెండు సంవత్సరాల కిందట ఓ సప్లయర్స్ షాపులో పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడని తెలిపారు. ఇతనికి ఎవరూ లేకపోవడంతో అనాధగా మృతి చెందాడని తెలిపారు. మొత్తం మీద ఈ సేవా కార్యక్రమం చేపట్టినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
మానవత్వం చాటుకున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ
- Advertisement -
RELATED ARTICLES


