విశాలాంధ్ర- వలేటివారిపాలెం : భూ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తహసీల్దార్ అబ్దుల్ అమీద్ అన్నారు.శుక్రవారం మండలంలోని బడేవారిపాలెం గ్రామంలో రెవిన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీ లలో రెవిన్యూ సదస్సు లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ప్రజల ముంగిటకే అధికార యంత్రాంగాన్ని తీసుకొని వచ్చి రెవిన్యూ సమస్యలను పరిష్కరించే దిశగా రెవిన్యూ సదస్సులను ప్రవేశపెట్టడం జరిగిందని దీనిని రైతులుఅందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ప్రసాదు, మండలసర్వేయర్ గోపి రెడ్డి,విఆర్ ఓ,మనోజ్ రెడ్డి , ఎండోమెంట్ జూనియర్ అసిస్టెంట్ పావని రెడ్డి,రెవిన్యూ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.