Homeఆంధ్రప్రదేశ్రహదారి నిర్మాణ పనులు 

రహదారి నిర్మాణ పనులు 

- Advertisement -

సర్వేగంగా ప్రధాన రహదారి నిర్మాణ పనులు 

విశాలాంధ్ర – సీతానగరం: ఎట్టకేలకు గత కొన్ని రోజులుగా సర్వేగంగా సీతానగరం, రాజమహేంద్రవరం ప్రధాన రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతుండడంతో ఆర్ అండ్ బి ఏ ఈ వీరన్న బాబు పనులను పరిశీలించారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో సుమారు 24 కిలోమీటర్ల ప్రధాన రహదారి పనులు ప్రారంభించి రఘుదేవపురం హర్ష వర్ధనా పాఠశాల వరకూ మధ్యమధ్యలో కల్వర్టులు మినహా పనులను పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రఘుదేవపురం గ్రామంలో గల ప్రధాన రహదారి విస్తరణ పనులు అనేక సమస్యలు తలెత్తడంతో చాలాకాలం పనులు నిలిచిపోయాయి. ఏట్టకేలక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చొరవతో సమస్యలు లేని చోట రోడ్డు విస్తరణ చేసుకుంటూ సమస్యలు ఉన్నచోట రోడ్డును అదే విధంగా నిర్మాణం చేస్తూ పనులను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఏ ఈ వీరన్న బాబు మాట్లాడుతూ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా మా ఆర్ అండ్ బి శాఖ అధికారులు పర్యవేక్షణలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. కొన్ని రోజుల్లోనే మండల ప్రజలకు గోతులు లేని ప్రధాన రహదారి పై ప్రయాణించే అవకాశం కలుగుతుందని అన్నారు.ఈ పర్యవేక్షణలో వర్క్ ఇన్స్పెక్టర్ రమణ పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు