Friday, January 10, 2025
Homeజిల్లాలునెల్లూరుసంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి.. సూపర్వైజర్ సునీత

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి.. సూపర్వైజర్ సునీత

విశాలాంధ్ర వలేటివారిపాలెం : సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాతి పండుగ అని, పండుగను సంకృతి సాంప్రదాయాలు మర్చిపోతున్న తరుణంలో చుండి అంగన్వాడీ సెంటర్ కార్యకర్తలు, ఆయాలు కనువిందు చేసే విధంగా సంకృతిని కాపాడుతూ భవిష్యత్తు చిన్నారులకు పండుగ విశిష్ట ను తెలియజేయడం సంతోషదాయకమని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత పేర్కొన్నారు.శుక్రవారం కందుకూరు ప్రాజెక్ట్ వలేటివారిపాలెం మండలం చుండి అంగన్వాడీ సెంటర్ లో సీడీపీఓ శర్మిష్ట సూచనల మేరకు సూపెర్వైజర్ సునీత ఆధ్వర్యంలో ముందుస్తు సంక్రాతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా సూపెర్వైజర్ సునీత పిల్లలకు భోగి పండ్లు పోసారు, బొమ్మల కొలువు, భోగి మంట, పిల్లలతో హరిదాసు, కోలాట ప్రదర్శన, గాలిపటాల ప్రదర్శన ఆకట్టుకున్నాయి అనంతరం సూపెర్వైజర్ సునీత మాట్లాడుతూ ఇలాంటి పండుగ వాతావరణం సృష్టించడం చాలా సంతోషంగా ఉందని అంగన్వాడీ కార్యకర్తలను సహాయకులను అభినందించారు.సంక్రాంతి ముందే వచ్చినట్లు కళ్లకు కట్టినట్లు కార్యక్రమం నిర్వహించడం అందరివల్ల కాదని చిన్నారులతో ఇంతటి కార్యక్రమం నిర్వహించినందుకు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చిన్నారులకు మన సంప్రదాయాలు అర్ధమయ్యేలా కళ్ళకు కట్టినట్లు వారికి చూపిస్తూ వారిచే వేష భాషల ద్వారా చేయుంచడంతో చిన్నారులకు మన సాంప్రదాయాలు తెలుస్తాయని అన్నారు ఈ కార్యక్రమం లో వర్కర్స్ జ్యోతి, రాజ్యలక్ష్మి, సుబ్బమ్మ, అమరజ్యోతి, హెల్పర్స్ రమ, సుశీల మరియు తల్లులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు