Homeజాతీయంఎస్‌బీఐ హెచ్చరికలు బేఖాతరు

ఎస్‌బీఐ హెచ్చరికలు బేఖాతరు

- Advertisement -

అయోధ్య విరాళాల లెక్కింపు సిబ్బందిని మార్చాలని కోరిన బ్యాంకు
అయోధ్య:
రామ మందిర విరాళాల దుర్వినియోగం వ్యవహారంలో రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. తవ్వేకొద్దీ అనేక లోపాలు బయటపడుతున్నాయి. లెక్కింపులో ఉన్న అవకతవకలను ఎస్‌బీఐ అధికారులు ముందే గుర్తించారు. లెక్కింపు సిబ్బందిని మార్చాలని 3 నెలల కిందటే శ్రీరామ తీర్థ్ క్షేత్ర ట్రస్టుకు సూచించారు. ఎస్‌బీఐ సూచనలను ట్రస్టు సభ్యులు పట్టించుకోలేదు. రూ.12 నుంచి రూ.15 వేలు జీతాలిచ్చి నగదు లెక్కింపు సిబ్బందిని ఎస్‌బీఐ నియమించుకుంది. వీరిపై అనుమానం రావడంతో సిబ్బందిని మార్చాలని బ్యాంకు సూచించింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వీరిని తొలగించేందుకు సిద్ధపడినా ట్రస్టు అధికారులు సిబ్బందిని కాపాడారని తెలుస్తోంది. మరోవైపు 5వ తేదీన ట్రస్టు సభ్యులు, ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసులు కలిసి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లకు వెళ్లి…వారి నుంచి దాదాపు రూ.58 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయినా నగదు దోచుకున్న వ్యక్తులపై 20 రోజుల వరకూ ట్రస్టు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. మరోపక్క అయోధ్య విరాళాల దొంగతనం కేసులో అరెస్టైన 8 మంది నిందితుల తరఫున వాదించరాదని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం తీర్మానం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు