Homeజిల్లాలుఅనంతపురంరామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం..

రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం..

- Advertisement -

అంబేద్కర్ నగర్ కాలనీలో కలకలం….

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న స్థానిక రామస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. తెలియని దుండగులు స్వామివారి వెండి కిరీటాలను అపహరించినట్లు సమాచారం. సుమారు 5 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు మాయం అయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు