ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న ఃస్త్రీశక్తిః పథకం కీలక మైలురాయిని చేరుకుంది.
ఈ పథకం కింద ఇప్పటివరకు 100 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలను మహిళలు వినియోగించుకున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
మహిళలకు రూ.3,500 కోట్ల ఆర్థిక ప్రయోజనం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలులోకి వచ్చిన స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఇప్పటివరకు సుమారు రూ.3,500 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలిగిందని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఉచిత ప్రయాణ సదుపాయం మహిళల రవాణా ఖర్చులను తగ్గించడంలో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.
రోజుకు 24 లక్షల మంది మహిళల ప్రయాణం
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని కొనకళ్ల నారాయణరావు తెలిపారు.స్త్రీశక్తి పథకం ద్వారా పెద్ద సంఖ్యలో మహిళలు ప్రయోజనం పొందుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు.ఎన్నికల హామీల అమలులో భాగంగా స్త్రీశక్తి పథకాన్ని గతేడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.అప్పటి నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుతోంది.తాజాగా ఈ పథకం ద్వారా 100 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు నమోదవడంతో ఏపీఎస్ఆర్టీసీ ఈ మైలురాయిని ప్రకటించింది.


