Homeజిల్లాలుఅనంతపురంకందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

- Advertisement -

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని రామనేపల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుడు భోగినేపల్లి సీసీ రాము కోరారు. ఆయన మాట్లాడుతూ కంది పంట సాగు చేసిన రైతులకు మద్దతు ధర అందించాలనే సదుద్దేశంతో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే కందులకు ప్రభుత్వం క్వింటాలు రూ.8 వేల చొప్పున మద్దతు ధర అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు 120 టన్నుల కందులను వివిధ గ్రామాల రైతులు విక్రయించారన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా షెడ్యూల్ ప్రకారం గ్రామాల వారీగా కొనుగోలు చేస్తున్నామన్నారు. కందులు విక్రయించే రైతులు పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబరును వెంట తీసుకురావాలన్నారు. విక్రయించిన రైతులకు నేరుగా వారి ఖాతాలకు డబ్బులు జమవుతాయన్నారు. కార్యక్రమంలో మరూరు స్టోర్ డీలర్ సూరీ, సల్లప్ప తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు