- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని పోతుకుంట గ్రామం వద్ద గల క్రైస్తవ చర్చి పైన ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి చర్చిలో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఇష్టానుసారంగా దాడులు చేస్తూ నష్టాన్ని కలిగించారని చర్చ్ నిర్వాహకులు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని వారి విజ్ఞప్తి చేశారు.


