విశాలాంధ్ర గుంతకల్లు.. స్థానిక వైఎస్ఆర్ సిపి క్యాంప్ కార్యాలయంలో గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త,మాజీ శాసన సభ్యులు వై.వెంకటరామిరెడ్డిసమక్షంలో బుధవారం వైస్సార్సీపీ పట్టణ కార్యదర్శి ఖరీం ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీ నుండి 20 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు .ఈ సందర్బంగా టీడీపీ నుండి వైస్సార్సీపీ లో చేరిన నాయకులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ముస్లిం మైనారిటీలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ముస్లిం మైనారిటీలను మోసం చేశారని అన్నారు.వైయస్.జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2024 వరకు ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని అన్నారు. .వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ముస్లిం మైనార్టీలకు గుర్తింపు లభిస్తుందనిఅన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ జెసిబి భాష, పట్టణ అధ్యక్షులు ఖలీల్, వైఎస్ఆర్సిపి పట్టణ ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైస్సార్సీపీ లో చేరిన టీడీపీ మైనారిటీ నాయకులు
- Advertisement -
RELATED ARTICLES


